నో సెలబ్రేషన్స్ అంటున్న రజనీకాంత్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ నెల 12న సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం రజనీకాంత్ పుట్టినరోజును అభిమానులు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే...ఈనెల 5న జయలలిత చనిపోయిన విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం వారం రోజులు పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి రాజాజీ హాలులో అమ్మ భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టారు.
రాష్ట్ర ప్రజలంతా దుఃఖంలో ఉన్న ఈ టైమ్ లో పుట్టినరోజు జరుపుకోవడం కరెక్ట్ కాదని భావించి పుట్టినరోజు వేడుకను రద్దు చేసుకోవాలని రజనీ నిర్ణయించున్నారు. అందుచేత ఈసారి తన పుట్టినరోజు కోసం బ్యానర్లు, పోస్టర్లు పెట్టద్దు అని రజనీ అభిమానులను కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com