షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన రజనీకాంత్ సతీమణి!

  • IndiaGlitz, [Monday,July 22 2019]

సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లత తన ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన జనాలంతా ఒకింత తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇలాంటి మనుషులు కూడా సమాజంలో ఉంటారా..? అని ఆశ్చర్యపోతున్నారు. నిండా రెండేళ్లు కూడా నిండని ఓ చిన్నారిని మహిళ పీక పిసకడం.. కాళ్లతో తన్నడం.. మీదెక్కి కూర్చోని గట్టిగా కొట్టడాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ వీడియోను ఎవరు తీశారో ఏమోగానీ.. లత కంటపడటంతో తీవ్ర ఆవేదన, భావోద్వేగానికి లోనైన ఆమె.. తన ట్విట్టర్ ద్వారా వీడియోను పంచుకున్నారు.

అంతటితో ఆగని ఆమె..ఇందులో తీవ్ర చిత్ర హింసలను అనుభవిస్తున్న బాలిక ఎవరో ఎవరికైనా తెలిస్తే, తమకు తెలియజేయండని ఓ ఫోన్ నంబర్‌ను కూడా ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ వీడియో చూసిన వారు ఈ ఘటనకు పాల్పడిన మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు బాలిక ఎవరో తెలిస్తే.. వెంటనే చెప్పాలని.. బాలికకు రక్షణ కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదిలా ఉంటే.. అనాధ బాలల కోసం ‘దయా ఫౌండేషన్’ను నిర్వహిస్తూ.. వారిని ఆదుకునేందుకు తనవంతుగా లత ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘పీస్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌’ పేరిట లత పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తుంటారన్న విషయం విదితమే.

More News

నువ్.. మొనగాడు, మగాడివైతే రాజీనామా చెయ్..!

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా రచ్చ ముదురుతోంది.

ఆగస్ట్ 15 న 'దండుపాళ్యం 4' విడుదల

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’

'డిస్కోరాజా' అగ‌ష్టు మెద‌టివారం డిల్లి లో షూట్‌

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'డిస్కోరాజా'

టీడీపీకి పెద్దదిక్కు గుడ్ బై.. త్వరలో బీజేపీలోకి!!

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఇటు టీడీపీ.. అటు కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడ్డ సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్-3 విన్నర్‌ ఎవరో అప్పుడే తెలిసిపోయిందోచ్!

ఇదేంటి షో ప్రారంభమై పట్టుమని పది గంటలు కూడా గడవలేదు.. అప్పుడే విన్నర్ ఎవరు..? అదిగో ఫలానా కంటెస్టెంటే విన్నర్..?