తలైవా హెచ్చరిక
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ `2.0`. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవతుంది. ఇండియన్ సినిమాల్లోనే అత్యధికంగా 600 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. తలైవా అభిమానులమంటూ రెండు వందల రూపాయల టికెట్‌ను రెండు వేలు..మూడు వేల రూపాయలకు విక్రయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన ప్రజా సంఘాలు, అభిమాన సంఘాలకు ఓ హెచ్చరిక చేశారు. తన అభిమానులమని, పార్టీ కార్యకర్తలమని చెప్పి థియేటర్ యాజమాన్యం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్మితే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com