తలైవా హెచ్చరిక‌

  • IndiaGlitz, [Monday,November 19 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల 29న విడుద‌ల‌వ‌తుంది. ఇండియ‌న్ సినిమాల్లోనే అత్య‌ధికంగా 600 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. కాగా.. త‌లైవా అభిమానుల‌మంటూ రెండు వంద‌ల రూపాయ‌ల టికెట్‌ను రెండు వేలు..మూడు వేల రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్నార‌ని వార్త‌లు వస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ త‌న ప్ర‌జా సంఘాలు, అభిమాన సంఘాల‌కు ఓ హెచ్చరిక చేశారు. త‌న అభిమానుల‌మ‌ని, పార్టీ కార్య‌కర్త‌ల‌మ‌ని చెప్పి థియేట‌ర్ యాజ‌మాన్యం నిర్ణ‌యించిన ధ‌ర కంటే ఎక్కువ‌గా అమ్మితే త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.