రజనీకాంత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ కి తమిళనాడులో ఎంతటి అభిమానబలం ఉందో...ప్రత్యేకించి చెప్పవలసి అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే..రజనీకాంత్ కి ఒక్క తమిళనాడులోనే కాదు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఇంతటి అభిమానగణం ఉన్న రజనీకాంత్ ని డి.ఎం.డి.కే అధినేత విజయ్ కాంత్ ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తూ...రాజకీయ నాయకులు భయపెడితే భయపడడానికి నేను ఏమీ రజనీకాంత్ లా పిరికివాడిని కాదు అంటూ రజనీ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.
రజనీకాంత్ ని ఇంత మాట అంటే అభిమానులు ఊరుకుంటారా...విజయ్ కాంత్ ఇలా సంచలన వ్యాఖ్యాలు చేసాడో లేదో..అలా విజయకాంత్ దిష్టబొమ్మలు దగ్దం చేసారు. రజనీకాంత్ ని విమర్శించడం...జర్నలిస్ట్ ల పై చేయి చేసుకోవడం..పబ్లిక్ ఫంక్షన్స్ తాగి రావడం.. తదితర కారణాల వలన విజయ్ కాంత్ పై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైంది.
గత ఎన్నికల్లో 28 సీట్లు సంపాదించుకున్న విజయ్ కాంత్ ఈసారి తనే గెలవలేకపోయాడు. ఇంతకంటే అవమానం ఏం కావాలి. అహంకారంతో...ఏమాత్రం ఆలోచన లేకుండా..అందులోను సూపర్ స్టార్ రజనీకాంత్ తో పెట్టుకుంటే అవుట్ పుట్ ఇలాగే ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com