33 ఏళ్ల తర్వాత అమితాబ్‌తో .. నా గుండె ఆనందంతో కొట్టుకుంటోంది, రజనీ ట్వీట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్.. భారతదేశం గర్వించదగ్గ నటులు. 70 ప్లస్‌లోనూ ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు వీరిద్దరూ. ఈ వయసులోనే పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమంటూ కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతటి స్టార్ డమ్ వున్నా.. నేటికీ ఎంతో వినియంగా వుంటారు ఈ ఇద్దరు సూపర్స్టార్లు. షూటింగ్ వుంటే వెళ్లడం లేదంటే పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వుంటారు. ఇక రజనీ అయితే సినిమాలు లేకపోతే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడతారు. భారతదేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ వీరికి అభిమానులు వున్నారు. అలాంటి ఈ ఇద్దరు లెజెండ్స్ ఓ సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీ అప్డేట్ ఇచ్చారు తలైవా.
జైలర్ బ్లాక్‌బస్టర్ కావడంతో మంచి ఊపులో వున్న రజనీకాంత్.. తన 170వ చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ టీజే. జ్ఞాన్వేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేరళ రాజధాని త్రివేండ్రంలోని ఓ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లో అమితాబ్ జాయిన్ అయ్యారట. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘‘33 సంవత్సరాల తర్వాత నా గురువు, రోల్ మోడల్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నా.. నా గుండె ఆనందంతో కొట్టుకుంటోంది’’ అంటూ రజనీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. అమితాబ్, రజనీలు తొలినాళ్లలో కలిసి నటించారు. అంధా కానూన్', 'గేరేఫ్తార్', 'హమ్'లో యాక్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments