మాస్ డైరెక్టర్‌తో రజనీ?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఖరారైనట్లు కోలీవుడ్‌లో వార్తలు వినపడుతున్నాయి. హీరోలను మాస్ యాంగిల్లో చూపించడంలో దర్శకుడు శివది ప్రత్యేకమైన శైళి. ఈ దర్శకుడు ఇప్పటి వరకు అజిత్‌తో వరుస సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సూర్య, శివ కాంబినేషన్లో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ఓ సినిమాను నిర్మించనున్నట్లు తెలియచేశాడు. అయితే ఈ సినిమానున ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. ఈ స్థానంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతానికి రజనీకాంత్ ..`దర్బార్` చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రజనీ, రాజకీయాల్లోకి వెళ్లడానికి కంటే ముందు కమిట్మెంట్ ఉన్న సినిమాలను పూర్తి చేయబోతున్నాడు. అందులోభాగంగానే సన్ పిక్చర్స్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. మరో పక్క సూర్య కూడా ప్రస్తుతం చేస్తున్న శూరరై పోట్రు సినిమాను పూర్తి చేసి తర్వాతే తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. రజనీతో సినిమాను పూర్తి చేసిన తర్వాత శివతో సూర్య సినిమా చేస్తాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments