బాలీవుడ్ నటుడే రజనీకాంత్ విలన్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `దర్బార్`. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుంటే.. నివేదా థామస్ కీలక పాత్రధారిగా నటిస్తుంది. రీసెంట్గా షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించిన ఈ చిత్రంలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వేసవి కారణంగా తదుపరి షెడ్యూల్‌కు కాస్త విరామం తీసుకున్నారు. రెండో షెడ్యూల్ మే 29న ప్రారంభమవుతుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటించబోతున్నాడట. ఇంతకు ముందు కాలాలో నానా పటేకర్ .. పేట చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి బాలీవుడ్ నటులు ప్రతి నాయకులుగా నటించారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా వెండితెరపై సందడి చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇప్పటికే మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోష్‌తో పాటు బాలీవుడ్ నటులు ప్రతీక్ బబ్బర్, దలీప్ తాహిల్ కూడా ఇందులో నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అనిరుధ్ సంగీతం.. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments