close
Choose your channels

14న హైదరాబాద్‌కు రజినీకాంత్...

Wednesday, December 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

14న హైదరాబాద్‌కు రజినీకాంత్...

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న పార్టీకి సంబంధించిన కీలక విషయాలన్నింటినీ వెల్లడిస్తానని రజినీ ప్రకటించారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో బిజీ అవడానికి ముందే తన సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే నిర్ణయానికి రజినీ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రజినీ ‘అణ్ణాత్తే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని నిర్ణయించారు.

ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూల్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో ప్లాన్ చేసింది. రజినీ ఈ నెల 15 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక విమానంలో 14న రజనీకాంత్‌ హైదరాబాద్‌కు వస్తారని సమాచారం. ఇక్కడ ఓ హోటల్‌లో ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో 45 రోజుల పాటు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరగనుంది. అయితే రజినీ పాల్గొనే సన్నివేశాలను మాత్రం ముందుగా కంప్లీట్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

14న హైదరాబాద్‌కు రజినీకాంత్...

కాగా.. సినిమాకు సంబంధించి లాక్‌డౌన్‌కు ముందే చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం రజనీకాంత్‌, ముఖ్య తారాగణంపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే ముందుగా రజనీ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఓ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను కూడా సెట్స్‌లో ఉంచుతున్నారు. రజనీకాంత్‌ సరసన నయనతార, కీర్తిసురేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment