సంక్రాంతికి ర‌జ‌నీ సంద‌డి

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

ఇటీవ‌లే కాలాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వ‌సూళ్ళ‌నే తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ యువ ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి, సిమ్ర‌న్‌, మేఘా ఆకాష్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీత‌మందిస్తున్నారు.

ఇటీవ‌లే డార్జిలింగ్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అంతేగాకుండా.. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తెలుగులోనూ అదే స‌మ‌యంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌చ్చు. కాగా.. ర‌జ‌నీ మ‌రో చిత్రం 2.0 ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

More News

16 ఏళ్ళు పూర్తిచేసుకున్న నితిన్‌

యువ‌త‌రంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ‌ క‌థానాయ‌కుల్లో నితిన్ ఒక‌రు. ప్రేమ‌క‌థా చిత్రాల‌ల్లోనే ఎక్కువ‌గా రాణించిన నితిన్‌..

ఎన్టీఆర్ పల్ల‌వే?

హీరో సుధీర్ బాబు రేపు ప్రేక్ష‌కుల‌ను 'స‌మ్మోహ‌నం' చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. హీరోగానే కాదు నిర్మాత‌గా కూడా రీసెంట్‌గా త‌న కెరీర్‌లో కొత్త అధ్యాయానికి సుదీర్ తెర‌తీసిన సంగ‌తి తెలిసిందే.

బాల‌య్య కొత్త సినిమా టైటిల్‌

తెలుగునాట ఫ్యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడిగా ట్రెండ్ సృష్టించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌మ‌ర‌సింహారెడ్డితో మొద‌లుపెట్టి న‌ర‌సింహనాయుడు

పుస్త‌క రూపంలో రెహ‌మాన్ బ‌యోగ్ర‌ఫీ

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి నేటి కాలం సంగీత ప్రియుల్లో తెలియ‌ని వారుండ‌రు.

ఇన్‌స్టా గ్రామ్‌లో ఎన్టీఆర్‌...

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా గ్రామ్ ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో సెల‌బ్రిటీలు త‌మ విష‌యాల‌ను వెల్ల‌డించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు.