సంక్రాంతికి ర‌జ‌నీ సంద‌డి

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

ఇటీవ‌లే కాలాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వ‌సూళ్ళ‌నే తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ యువ ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి, సిమ్ర‌న్‌, మేఘా ఆకాష్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీత‌మందిస్తున్నారు.

ఇటీవ‌లే డార్జిలింగ్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అంతేగాకుండా.. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తెలుగులోనూ అదే స‌మ‌యంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌చ్చు. కాగా.. ర‌జ‌నీ మ‌రో చిత్రం 2.0 ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.