విలేకరి ప్రశ్నకి అదిరిపోయే సమాధానమిచ్చిన సూపర్ స్టార్

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

రజనీకాంత్-అక్షయ్ కుమార్- శంకర్ ల చిత్రం 2.0 ఆడియోని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు దుబాయ్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ చిత్ర నటీనటులు రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్‌, దర్శకుడు శంకర్‌, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్నారు.

ముందుగా ఈ రోజు ప్రత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి సూపర్ స్టార్ అదిరిపోయే సమాధానం ఇచ్చారట.

అదేమిటంటే... మీరు ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు సర్‌...' అని ఓ విలేకరి ప్రశ్నించగా, నిజ జీవితంలో నటించడానికి నాకు ఎవ్వరూ డబ్బు ఇవ్వరు. అందుకే సింపుల్‌గా ఉంటా' అని తనదైన స్టైల్‌'లో సమాధానమిచ్చారట రజినీకాంత్.