డ‌బ్బింగ్ షురూ చేసిన రజినీకాంత్

  • IndiaGlitz, [Friday,November 15 2019]

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న 'ద‌ర్బార్‌' చిత్రానికి సంబంధించిన డ‌బ్బింగ్ చెప్ప‌డం మొద‌లు పెట్టేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్ ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. కాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో త‌న వంతు పార్ట్‌ను పూర్తి చేయ‌గానే ర‌జ‌నీకాంత్ 168వ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాడ‌ట‌. డైరెక్టర్‌ శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

హీరోలను మాస్‌గా చూపించడంలో శివ స్పెషలిస్ట్‌. అందుకనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్‌ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్‌తో శివ సినిమా అనగా మాస్‌ ఇమేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రజనీకాంత్‌తో శివాజీ, రోబో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రజనీకాంత్‌తో మంజు వారియర్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి వ్యూహం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.