బాహుబలిపై కన్నేసిన '2.0'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తుంటే, ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2018 జనవరి 25న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే బడ్జెట్‌లోనే కాకుండా వసూళ్ళ పరంగా కూడా 2.0 రికార్డులను క్రియేట్ చేయాలని యూనిట్ యోచిస్తోంది. అందుకు శంకర్ అండ్ టీం ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
వరల్డ్‌వైడ్‌గా బాహుబలి -2 కలెక్షన్స్ 1650 కోట్లను దాటింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్‌ను 2.0 క్రాస్ చేయడానికి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేయనున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments