బాహుబలిపై కన్నేసిన '2.0'

  • IndiaGlitz, [Wednesday,May 31 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మ‌రోసారి రోబో చిట్టిగా త‌న మాయాజాలాన్ని తెర‌పై చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే, ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2018 జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అయితే బ‌డ్జెట్‌లోనే కాకుండా వ‌సూళ్ళ ప‌రంగా కూడా 2.0 రికార్డుల‌ను క్రియేట్ చేయాల‌ని యూనిట్ యోచిస్తోంది. అందుకు శంక‌ర్ అండ్ టీం ఇప్ప‌టి నుండే స‌న్నాహాలు చేస్తున్నారని స‌మాచారం.

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా బాహుబ‌లి -2 క‌లెక్ష‌న్స్ 1650 కోట్ల‌ను దాటింది. ఇప్పుడు ఈ క‌లెక్ష‌న్స్‌ను 2.0 క్రాస్ చేయ‌డానికి సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 15 భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నార‌ట‌.

More News

సూసైడ్ డిసీజ్ తో బాధపడుతున్న సల్మాన్...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ త్వరలోనే ట్యూబ్ లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాలో బిజీగా ఉన్న ఈ సూపర్ స్టార్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే గత ఏడున్నరేళ్ళుగా సల్మాన్ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధితో బాధపడుతున్నాడట.

షారూక్కు తృటిలో తప్పిన ప్రమాదం...

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్కు తృటిలో పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకెళ్తే..షారూక్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో డ్బార్ఫ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. డ్వార్ఫ్ అంటే చిన్న లేదా పొట్టి అని అర్థం.టైటిల్కు తగ్గట్టుగానే షారూక్ ఈ చిత్రంలో పొట్టివాడుగా కనపడుతున్నాడు.

దాసరి అంత్యక్రియలు పూర్తి...

తెలుగు సినిమా కీర్తిని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్కు ఎక్కించిన దర్శకుడు దర్శకరత్న డా.దాసరి మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్లో తుది శ్వాస విడిచారు.

దాసరి మృతిపై ఆయన కోడలు సుశీల అనుమానం...

దర్శకరత్న డా.దాసరి ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు.

తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే...........

'కధ,స్క్రీన్ ప్లే,మాటలు,పాటలు,నిర్మాత,దర్శకత్వం'..'దాసరి నారాయణరావు'అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే,ఆఖరి వ్యక్తీ మీరే..