సీక్వెల్ వ‌ద్ద‌న్న ర‌జ‌నీకాంత్‌

  • IndiaGlitz, [Friday,June 29 2018]

1995లో వ‌చ్చిన 'బాషా' చిత్రం ఎంత‌ సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా సురేష్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా తమిళ‌, తెలుగు భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ కావ‌డ‌మే కాకుండా.. స్క్రీన్‌ప్లే ప‌రంగా ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అలాంటి బాషా సినిమాకి సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న.. సాయి ర‌మ‌ణి అనే ద‌ర్శ‌కుడికి ('ప‌టాస్' రీమేక్ 'మొట్ట శివ కెట్ట శివ‌'కి ద‌ర్శ‌కుడు) వ‌చ్చింది.

ఆ ఆలోచ‌ల‌ను డెవ‌ల‌ప్ చేసుకుని.. స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. అంతేగాకుండా.. ర‌జ‌నీతో ఈ ప్రాజెక్ట్ విష‌య‌మై చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. ర‌జ‌నీకి స్క్రిప్ట్ న‌చ్చిన‌ప్ప‌టికీ.. బాషా లాంటి క్లాసిక్‌ను సీక్వెల్ పేరుతో ట‌చ్ చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. దాంతో.. ఆ ద‌ర్శ‌కుడు మ‌రో కొత్త క‌థ‌ను త‌యారుచేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌.