'క‌బాలి' బాషా కాదంటున్న ర‌జ‌నీ

  • IndiaGlitz, [Friday,September 11 2015]

బాషా సినిమా పేరు చెప్తేనే ఓ సెన్సేష‌న్ ఉంటుంది. ఓ వైబ్రేష‌న్ ఉంటుంది. ఆ ఫార్ములాతో ఆ త‌ర్వాత ఎన్ని సినిమాలు వ‌చ్చాయో ఎవ‌రికీ తెలియ‌దు. సిల్వ‌ర్ స్క్రీన్ చ‌రిత్ర‌లో ఓ మైలురాయిలా నిలిచిన సినిమా అది. ఆ సినిమా నిర్మాత ఆర్‌.ఎం.వీర‌ప్ప‌న్ జ‌న్మ‌దిన‌వేడుక‌లు ఈ మ‌ధ్య‌నే జ‌రిగాయి. ఆ వేడుక‌ల్లో ర‌జ‌నీకాంత్ పాల్గొన్నారు. ''క‌బాలి సినిమాను అంద‌రూ బాషాలాగా ఉంటుందా? అని అడుగుతున్నారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ సినిమాలాగా ఉండ‌దు. ఇది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బాషా సినిమా అలా కుదిరింది అంతే. మ‌ర‌లా అలాంటి సినిమా ఎప్పుడొస్తుందో చెప్ప‌లేం. నా దృష్టిలో సినిమాను నిర్మించి, దానికి స‌రిగా మ‌ర్కెటింగ్ చేసి, ప్రేక్ష‌కుల‌కు చేరువ చేయ‌డంలో ఏవీఎం సంస్థ గొప్ప‌ది. అలాగే మాస్ హీరోని వీర‌ప్ప‌న్ చేతిలో పెడితే, ఆ హీరోకు త‌గ్గ క‌థ‌ల‌ను వెతికి ఎంతో గొప్ప‌గా సినిమాల‌ను తీసి, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ చేసి బాక్సాఫీసును షేక్ చేయ‌డంలో వీర‌ప్ప‌న్‌గారికున్న ప్ర‌తిభ వేరు. వీర‌ప్ప‌న్ పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పాల్గొని ఇలా మాట్లాడుతున్నాన‌ని అంద‌రూ అనుకుంటున్నారేమో.. కానీ అది త‌ప్పు. నేను ఈ మాట‌ల‌ను నా మ‌న‌స్ఫూర్తిగా చెబుతున్నాను. ఇలాంటి నిర్మాత‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.

More News

హారీష్ పాత‌క‌థ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..?

హారీష్ శంక‌ర్..మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

'హోరా హోరి' మూవీ రివ్యూ

ఉన్నదున్నట్టు మాట్లాడే దర్శకుడు తేజ. మంచయినా, చెడయినా ముఖం మీద చెప్పగలగడం గొప్ప విషయమే. చిత్రం, జయంతో పాటు పలు సినిమాలకు దర్శకత్వం వహించిన తేజ తెరకెక్కించిన తాజా సినిమా హోరాహోరీ.

నాగార్జున భ‌క్తి చిత్రం ప్రారంభం ఎప్పుడు...?

నాగార్జున‌, రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన అధ్యాత్మిక అద్భుతం అన్న‌మ‌య్య‌. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే.

నాగ‌చైత‌న్య‌, నితిన్ ఇద్ద‌రిలో ఎవ‌రు కరెక్ట్..?

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రం త‌ర్వాత స్టార్స్ తో సినిమా చేయ‌డానికి కాస్త టైం ప‌డుతుంది.

మ‌నోజ్ కూడా స్టార్ట్ చేసాడు..

మంచు విష్ణు కొత్త సినిమా ప్రారంభించాడు. మ‌రి..మ‌నోజ్ ఏంటి సైలెంట్ గా ఉన్నాడు. ఇంకా సినిమా స్టార్ట్ చేయలేద‌నుకున్నారు.