'కబాలి' బాషా కాదంటున్న రజనీ
Send us your feedback to audioarticles@vaarta.com
బాషా సినిమా పేరు చెప్తేనే ఓ సెన్సేషన్ ఉంటుంది. ఓ వైబ్రేషన్ ఉంటుంది. ఆ ఫార్ములాతో ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయో ఎవరికీ తెలియదు. సిల్వర్ స్క్రీన్ చరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిన సినిమా అది. ఆ సినిమా నిర్మాత ఆర్.ఎం.వీరప్పన్ జన్మదినవేడుకలు ఈ మధ్యనే జరిగాయి. ఆ వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. ``కబాలి సినిమాను అందరూ బాషాలాగా ఉంటుందా? అని అడుగుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాలాగా ఉండదు. ఇది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బాషా సినిమా అలా కుదిరింది అంతే. మరలా అలాంటి సినిమా ఎప్పుడొస్తుందో చెప్పలేం. నా దృష్టిలో సినిమాను నిర్మించి, దానికి సరిగా మర్కెటింగ్ చేసి, ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఏవీఎం సంస్థ గొప్పది. అలాగే మాస్ హీరోని వీరప్పన్ చేతిలో పెడితే, ఆ హీరోకు తగ్గ కథలను వెతికి ఎంతో గొప్పగా సినిమాలను తీసి, బ్లాక్ బస్టర్ హిట్స్ చేసి బాక్సాఫీసును షేక్ చేయడంలో వీరప్పన్‌గారికున్న ప్రతిభ వేరు. వీరప్పన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఇలా మాట్లాడుతున్నానని అందరూ అనుకుంటున్నారేమో.. కానీ అది తప్పు. నేను ఈ మాటలను నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇలాంటి నిర్మాతతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com