నేనెవరికీ సపోర్ట్ చేయడం లేదు : రజనీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్.. సినిమాల్లో తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజనీకాంత్ ఎప్పటి నుండో రాజకీయాల్లో వస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన వార్తలు మరింత ఉపందుకున్నాయి.
ఇప్పుడు జయలలిత నియోజక వర్గం ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు రజనీకాంత్‌ను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గంగై అమరన్ రీసెంట్గా రజనీకాంత్‌ను కలిసి మాట్లాడారు. దీంతో రజనీకాంత్ బి.జె.పికి సపోర్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ రజనీకాంత్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదంటూ మెసేజ్ పెట్టేశారు. దీంతో రజనీకాంత్‌కు సంబంధించిన రాజకీయ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టినట్టయ్యింది. ప్రస్తుతం రజనీకాంత్ 2.0 సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com