మే నెల్లో రజనీకాంత్ 'కబాలి' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా `కబాలి`. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆయన లుక్ కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. సాల్ట్ పెప్పర్ లుక్కుతో నోట్లో పైప్‌తో రాజసంగా రజనీకాంత్ కూర్చున్న ఫస్ట్ లుక్ స్టిల్కు సర్వత్రా పాజిటివ్ స్పందన వెల్లడైంది. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన కలైపులి.యస్.థాను ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. జనవరి 20 నుంచి ఈ షెడ్యూల్‌ను మలేషియాలో తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్‌తో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 28 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఈ సినిమా గురించి నిర్మాత కలైపులి.యస్.థాను మాట్లాడుతూ ``నేను చాలా మంది పెద్ద హీరోలతో పనిచేశాను. కానీ రజనీకాంత్‌గారితో సినిమా చేయడమనేది నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. ఇది నా లైఫ్ టైమ్ గుర్తుండిపోయే సినిమా. ఈ చిత్రంలో ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, చైనా సూపర్‌స్టార్ విల్సన్ చౌ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు మలేషియాలో చేస్తున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సంతోష్ నారాయణ్ సమకూర్చిన బాణీలకు తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్ పాటలను రాస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం`` అని చెప్పారు.
రజనీకాంత్, రాధికా ఆప్టే, థన్సిక, కిశోర్, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: మురళీ, సంగీతం: సంతోష్ నారాయణ్, ఆర్ట్: రామలింగం, ఫైట్స్: అన్బరివు, మాటలు: సాహితి, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, మేకప్: భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: `దేవి-శ్రీదేవి` సతీష్, నిర్మాత: కలైపులి.ఎస్.థాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com