కబాలికి రజనీ అంత తీసుకున్నాడా..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. ఈ సినిమాకి రజనీకాంత్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే...షాక్ అవుతారు. ఇంతకీ కబాలి కోసం రజనీ రెమ్యూనరేషన్ ఎంత అంటే...అక్షరాల 60 కోట్లు తీసుకున్నారట.
విక్రమసింహా, లింగా చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే సక్సస్ ఫుల్ మూవీ చేయాలి అనుకున్నారట. అది కూడా తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలి అని చెప్పారట. దీంతో నిర్మాత కలై ఫులి ఎస్ థాను రజనీకి 60 కోట్లు రెమ్యూనరేషన్ మిగిలిన ప్రొడక్షన్ కి 25 కోట్లు ఖర్చు చేసేలా బడ్జెట్ రూపొందించారట. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి 150 కోట్ల బిజినెస్ చేసారట.
కబాలి రిజెల్ట్ గురించి పక్కనపెడితే రజనీ రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాక్ అయ్యింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే 60 కోట్లు రెమ్యూనరేష్ తీసుకున్న హీరోగా రజనీకాంత్ మరో రికార్డు సొంతం చేసుకున్నారు అంటున్నారు సినీపండితులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments