కబాలికి రజనీ అంత తీసుకున్నాడా..!

  • IndiaGlitz, [Wednesday,August 03 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ సినిమాకి ర‌జ‌నీకాంత్ ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నారో తెలిస్తే...షాక్ అవుతారు. ఇంత‌కీ క‌బాలి కోసం ర‌జ‌నీ రెమ్యూన‌రేషన్ ఎంత అంటే...అక్ష‌రాల 60 కోట్లు తీసుకున్నార‌ట‌.

విక్ర‌మ‌సింహా, లింగా చిత్రాలు ప్లాప్ అవ్వ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌స్ ఫుల్ మూవీ చేయాలి అనుకున్నార‌ట‌. అది కూడా త‌క్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలి అని చెప్పార‌ట‌. దీంతో నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ర‌జ‌నీకి 60 కోట్లు రెమ్యూన‌రేష‌న్ మిగిలిన ప్రొడ‌క్ష‌న్ కి 25 కోట్లు ఖ‌ర్చు చేసేలా బ‌డ్జెట్ రూపొందించార‌ట‌. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని త‌క్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి 150 కోట్ల బిజినెస్ చేసార‌ట‌.

క‌బాలి రిజెల్ట్ గురించి ప‌క్క‌న‌పెడితే ర‌జ‌నీ రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాక్ అయ్యింది. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే 60 కోట్లు రెమ్యూన‌రేష్ తీసుకున్న హీరోగా ర‌జ‌నీకాంత్ మ‌రో రికార్డు సొంతం చేసుకున్నారు అంటున్నారు సినీపండితులు.

More News

న్యూమూవీ టైటిల్ & క్యారెక్టర్ రివీల్ చేసిన మనోజ్

వైవిధ్యమైన కథా చిత్రాలను ఎంచుకుంటున్న మంచు మనోజ్ తన న్యూమూవీ టైటిల్ ను ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

భారీ రేటుకు బాహుబలి 2కు తమిళ వెర్షెన్ రైట్స్..

ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకధీర రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

చిరంజీవి గారు అలా...ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదు - అల్లు శిరీష్

గౌరవం చిత్రంతో హీరోగా పరిచయమై...కొత్త జంట సినిమాతో విజయం సాధించిన యువ హీరో అల్లు శిరీష్.తాజాగా అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా.రాజశేఖర్ కొత్త చిత్రం

చందమామ కథలు వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్

జనతా గ్యారేజ్ ఆడియో విడుదలకు ముహుర్తం ఖరారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ జనతా గ్యారేజ్.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.