Indian 2 : రేపు కమల్‌హాసన్ ‘ఇండియన్ 2 ’ నుంచి ఇంట్రో .. శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశం గర్వించదగ్గ కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారతీయుడు చిత్రం ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతిపై .. ఓ స్వాతంత్య్ర సమరయోధుడు చేసిన పోరాటమే ఇతివృత్తంగా శంకర్ సంధించిన అస్త్రమే భారతీయుడు. 1996లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొద్ద రికార్డులను సృష్టించడంతో పాటు కమల్ హాసన్‌కు, శంకర్‌కు మంచి పేరును తీసుకొచ్చింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు శంకర్ అదే ‘‘ఇండియన్ 2’’. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇండియన్ 2 చిత్రం కోసం తమిళ ప్రేక్షకులతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసిన మేకర్స్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సినిమా ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకుంది. ప్రస్తుతం సూపర్ ఫాంలో వున్న అనిరుధ్ సంగీతం అందించడంతో ఇండియన్ 2 ఆడియోపైనా భారీ అంచనాలున్నాయి. ఇక శంకర్ సినిమా అంటే ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పక్కా. ఈ నేపథ్యంలో ఇండియన్ 2కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఇండియన్ ఇంట్రో 2 వీడియోను రేపు సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయనున్నారు. తమిళ్లో రజనీకాంత్, తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్, కన్నడలో కిచ్చా సుదీప్ ఈ ఇంట్రోను విడుదల చేయనున్నారు. ఈ మూవీలో సిద్ధార్ధ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com