ర‌జినీ పొలిటిక‌ల్ పార్టీకి ముహూర్తం కుదిరింది!

  • IndiaGlitz, [Sunday,February 09 2020]

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ర‌జినీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు కానీ.. ఎప్పుడ‌నేది మాత్రం చెప్ప‌లేదు. అస‌లు ర‌జినీకాంత్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎప్పుడొస్తారా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయ‌న మాత్రం త‌న సినిమాల‌ను చేసుకుంటూ పోతున్నారు. కానీ త‌న పార్టీ గురించి ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ర‌జినీకాంత్ రాజ‌కీయ పార్టీ సిద్ధమైయ్యార‌ట‌. ఏప్రిల్ నెల‌లో ర‌జినీకాంత్ త‌న పార్టీని అనౌన్స్ చేస్తార‌ని ఆయ‌న స‌న్నిహితులు ప్ర‌స్తావిస్తున్నార‌ట‌. దీంతో కోలీవుడ్‌లో త‌లైవ‌ర్ రాక క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్టేన‌ని అంద‌రూ అంటున్నారు.

త‌మిళ సంత్స‌రాది సంద‌ర్భంగా ఏప్రిల్ 14న ర‌జినీకాంత్ త‌న పార్టీని ప్ర‌క‌టిస్తార‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళ‌నాడు ఎన్నిక‌లు మే 2021లో జ‌ర‌గ‌నున్నాయి. ఆలోపు పార్టీని అనౌన్స్ చేసుకుని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ర‌జినీకాంత్ సినిమాల పరంగా త‌న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసేస్తున్నారు. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ‌ల్ పెద్ద‌గా మార్పులు చూప‌లేదు. కానీ.. ర‌జినీ ఎంట్రీ ఎలా ఉండబోతుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న మాస్ ఇమేజ్‌తో త‌మిళ రాజ‌కీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తారా అనే ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

More News

నూర్ కుటుంబానికి చెర్రీ 10 లక్షల ఆర్థిక సాయం.. భరోసా

మెగాహీరోలను.. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణంగా అభిమానించే హైదరాబాద్‌కు చెందిన వీరాభిమాని నూర్ మహ్మద్ డిసెంబర్-8న మృతి చెందిన విషయం తెలిసిందే. సిటీ చిరంజీవి

‘కేజ్రీ’కే ఢిల్లీ కిరీటం.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకూ 58 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదా.. మాకు ఫిర్యాదు చేయండి!

న్యూ ఢిల్లీ: బ్యాంకుల్లో రుణాలు ఇవ్వట్లేదని జనాలు నానా తంటాలు పడుతుంటారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'  ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు హెచ్‌బీవో స్పెష‌ల్ సర్‌ఫ్రైజ్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు సూపర్ మ్యాన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమన్న సంగతి తెలిసిందే.