రజినీ పొలిటికల్ అనౌన్స్మెంట్ అప్పుడేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాల నుండి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు కానీ.. ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. అసలు రజినీకాంత్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎప్పుడొస్తారా ? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన మాత్రం తన సినిమాలను చేసుకుంటూ పోతున్నారు. కానీ తన పార్టీ గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు రజినీకాంత్ రాజకీయ పార్టీని అనౌన్స్ చేయడానికి సిద్ధం చేసుకుంటున్నారట. ఏప్రిల్‌లో అనౌన్స్ చేయాలని అనుకుంటే ఆలోపలే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైంది. ఆగస్ట్‌లోపు పరిస్థితులు చక్క బడతాయని అనుకుంటే ఇంకా పరిస్థితులు చక్కబడటానికి సమయం పట్టేలానే ఉంది. దీంతో నవంబర్‌లో తన పార్టీ పేరుని, విధి విధాలను రజినీకాంత్ ప్రకటిస్తారట.
తమిళనాడు ఎన్నికలు మే 2021లో జరగనున్నాయి. ఆలోపు పార్టీని అనౌన్స్ చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు రజినీకాంత్ సినిమాల పరంగా తన కమిట్మెంట్స్ను పూర్తి చేసేస్తున్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన కమల్ పెద్దగా మార్పులు చూపలేదు. కానీ.. రజినీ ఎంట్రీ ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయన మాస్ ఇమేజ్‌తో తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తారా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout