ఫ్యాన్స్ కోసం రజనీ ప్లాన్స్...

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 12. ర‌జీనీ పుట్టిన‌రోజు అభిమానుల‌కు పండుగ రోజు. త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ విదేశాల్లో ర‌జ‌నీ ఫ్యాన్స్ ఉన్నారు. వారంద‌రూ ర‌జ‌నీ పుట్టిన‌రో్జున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఇక ఫ్యాన్స్ కోసం ర‌జ‌నీ ప్లాన్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే...ఫ్యాన్స్ ని సంతోషం క‌లిగించ‌డం కో్సం ర‌జ‌నీ పుట్టిన‌రోజు నాడు క‌బాలి పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ రోబో 2లో న‌టించ‌నున్నారు. రోబో 2 మూవీని కూడా ర‌జ‌నీ పుట్టిన‌రోజు నాడు ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌.డిసెంబ‌ర్ 2వ‌ వారానికి క‌బాలి షూటింగ్ పూర్త‌వుతుంది. డిసెంబ‌ర్ 18 నుంచి రోబో 2 రెగ్యుల‌ర్ షూట్ స్టార్ట్ చేయ‌నున్నారు. సో... ఈ పుట్టిన‌రోజు నాడు ర‌జనీ ఫ్యాన్స్ కి రెండు పండ‌గ‌లు.