'పేట్ట' షూటింగ్ పూర్తి...

  • IndiaGlitz, [Friday,October 19 2018]

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ వార‌ణాసిలో పూర్త‌య్యింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమంటే.. మ‌రో ప‌దిహేను రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ అనుకున్న తేదీ కంటే ముందుగానే పేట్ట చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ర‌జ‌నీకాంత్ వంటి సూప‌ర్‌స్టార్ సినిమా అంటే షెడ్యూల్ కొన్ని కార‌ణాల‌తో ఆల‌స్య‌మ‌వుతుంది కానీ.. అనుకున్న తేదీ కంటే ప‌దిహేను రోజుల ముందు పూర్తి కావ‌డం గొప్ప విష‌యమే కదా.

ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతానికైతే సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. మ‌రి షెడ్యూల్ అనుకున్న దాని కంటే ముందుగానే పూర్తయ్యింది కాబ‌ట్టి సినిమా విడుద‌ల‌నేమైనా ప్రీ పోన్ చేస్తారేమో చూడాలి.

ర‌జ‌నీకాంత్‌తో పాటు న‌వాజుద్దీన్ సిద్ధికీ, విజ‌య్ సేతుప‌తి, త్రిష‌, సిమ్రాన్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారులు. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.