ఆకట్టుకుంటున్నతలైవా లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
తలైవా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ప్రస్తుతం వారణాసి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. రజనీకాంత్, త్రిష, సిమ్రాన్ తదితరులు ఈ షెడ్యూల్ పాల్గొంటున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండో లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ లుక్ ట్రెడిషనల్‌గా ఆకట్టుకుంటోంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు.
నవాజుద్దీన్ సిద్ధికీ కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments