close
Choose your channels

రజనీకాంత్ టైటిల్ ఖరారు...

Tuesday, August 18, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం అంటేనే స్క్రిప్ట్ వర్క్ నుండి చివరి వరకు సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే గత రెండు చిత్రాలు కొచ్చడయాన్`, లింగ` చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోకపోవడంతో తన తదుపరి చిత్రంపై రజనీకాంత్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం. అట్టకత్తి`, మద్రాస్` చిత్రాల ఫేమ్ డైరెక్టర్ పా రంజిత్ తో చేయడానికి రెడీ అయిపోయాడు. ఇందులో గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ దర్శనమిస్తున్నాడు.

మలేషియా, సింగపూర్ లలో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంటుంది. రాధికాఅప్టే హీరోయిన్ గా నటిస్తుంది. ధన్సిక రజనీ కూతురుగా తెరపై కనపడనుంది. తాజాగా ఈ చిత్రానికి కబాలి` అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. అధికారకంగా సమాచారం వెలువడాల్సి ఉంది. చెన్నలోని కబాలి అనే గ్యాంగ్ స్టర్ లైఫ్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి విలన్ గా నటిస్తున్నాడు. కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.