అమితాబ్ 3 స‌ల‌హాల్లో 1 దాన్ని పాటించ‌లేక‌పోతున్నాను: ర‌జినీకాంత్‌

  • IndiaGlitz, [Tuesday,December 17 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'ద‌ర్బార్‌'. ఈ సినిమా జ‌న‌వ‌రి 9న సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ముంబైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ర‌జినీకాంత్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ మీటింగ్‌లో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. మీకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్య‌క్తి ఎవ‌రు? అని విలేక‌రులు అడ‌గ్గా.. నాకు అమితాబ్‌గారు జీవితంలో స్ఫూర్తి. కెమెరా ముందే కాదు... కెమెరా వెనుక కూడా ఆయ‌న నాకు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచారు.

ఆయ‌న జీవితంలో మూడు స‌ల‌హాల‌ను న‌న్ను న‌టించ‌మ‌ని కోరారు. అందులో మొద‌టిది 60 ఏళ్ల వ‌య‌సులో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. త‌రుచూ వ్యాయామం చెయ్‌.. రాజ‌కీయాల్లోకి మాత్రం వెళ్ల‌వ‌ద్దు అని సూచించారు. మొద‌టి రెండు స‌ల‌హాల‌ను పాటించాను కానీ.. కాల ప‌రిస్థితుల కార‌ణంగా మూడో స‌ల‌హాను పాటించ‌లేక‌పోతున్నాను అని అన్నారు. అంటే రాజ‌కీయాల్లోకి ఆయ‌న రావ‌డం ప‌క్కా అయ్యింది. అయితే ఆయ‌న అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం చేయాల్సి ఉంద‌ని మరోసారి చెప్ప‌క‌నే చెప్పారు తైల‌వా. ఇది వ‌ర‌కు ఆడియో వేడుక‌లో కూడా త‌న రాజ‌కీయాల్లో వ‌స్తున్న‌ట్లు ఇన్ డైరెక్ట్‌గా చెప్పారు ర‌జినీకాంత్‌.

More News

జగన్ ఊహించని ప్రకటన: ఏపీలో మూడు రాజధానులు

వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి పరిస్థితేంటి..?

భూమలు ‘బాంబ్’ పేల్చిన బుగ్గన.. టీడీపీలో కలవరం!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, ఉపాధి హామీ నిధులతో పాటు అతి ముఖ్యమైన నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై హాట్ హాట్‌గా చర్చ జరిగింది.

ఇన్‌స్టాగ్రామ్ ‘క్యాప్షన్‌ వార్నింగ్..’ తస్మాత్ జాగ్రత్త!

టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతోంది.. దాన్ని పనికొచ్చే పనులకు వాడుకోవాల్సింది పోయి.. కొందరు అనవసర పనులకు వాడేస్తున్నారు.

'వైఫ్ ఐ' జనవరి 1న గ్రాండ్ రిలీజ్

'ఏడు చేపల కథ' లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి.

ముషారఫ్‌ను నిజంగానే ఉరి తీస్తారా!?

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు ఆ దేశంలోని ప్రత్యేక కోర్టు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.