పుట్టిన రోజు వేడుకలు వద్దంటున్న రజనీ..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12. ఈ రోజు అభిమానులకు పండగ రోజు. భారతదేశంలోనే కాదు..రజనీకాంత్ కు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. వారందరూ రజనీ పుట్టినరోజు వచ్చిందంటే..ఓ పండగలా వేడుకలు జరుపుకుంటారు. అయితే గత కొన్ని రోజులుగా చెన్నైలో కురుస్తున్నవర్షాలు..ప్రజల ఇబ్బందులు చూసిన రజనీకాంత్ ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించకున్నారట. తన పుట్టినరోజు నాడు చేసే వేడుకలను రద్దు చేసి ఆ డబ్బుతో వరద భాదితులకు సహాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఆయన వరద బాధితుల కోసం ఆర్ధిక సహాయం చేయడంతో పాటు..ఇలా పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని అభిమానులకు సేవా కార్యక్రమాలు చేయాలంటూ పిలుపు నివ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com