మే నెలలో రజనీకాంత్ కొత్త సినిమా షురూ..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ 2.0 షూటింగ్ ముగించుకుని తదుపరి సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడెవరనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ముందు ధనుష్ తన స్వంత బ్యానర్ వండర్ బార్స్ సంస్థలో కబాలి ఫేమ్ పా రంజిత్‌తో సినిమా చేయబోతున్నానని తెలియజేశాడు.
కానీ కొన్నిరోజుల క్రితం చెన్నైలోని సినీ వర్గాలు మాత్రం డైరెక్టర్ శివను కథ చెప్పడానికి రజనీకాంత్ ఆహ్వానించాడని, అన్నీ ఓకే అయితే ఈ కాంబినేషన్లోనే సినిమా ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్న మళ్ళీ కోలీవుడ్ సినీ వర్గాల్లో కొందరు మాత్రం ధనుష్ నిర్మాతగా రజనీకాంత్, పా రంజిత్ సినిమా మే నెలలో స్టార్ట్ కాబోతుందని తెలిపారు. అంటే వచ్చే ఏడాది రజనీకాంత్ ఎక్కవ గ్యాప్ తీసుకోకుండా రెండు సినిమాలు చేస్తాడా లేక, డైరెక్టర్‌ను మారుస్తాడా అనేది తెలియడం లేదు. క
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com