రజనీకాంత్ కొత్త సినిమాల విశేషాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చడయాన్`, లింగ` చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుని నెక్స్ ట్ మూవీకి రెడీ అవుతున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో చేయనున్న ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. మలేషియా, సింగపూర్ లో ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ చేసుకోనుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో వాటికి బలాన్ని చేకూరుస్తూ ఆగస్ట్ మొదటివారంలో ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్ నే మలేషియాలో 40 రోజులు పాటు చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని సమాచారం.
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ చేయనున్న రోబో 2` సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం రోబో 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com