రజనీకాంత్ 'కాలా'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మే 28న సినిమా స్టార్ట్ కానుంది. కబాలి తర్వాత పారంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ధనుష్ తన స్వంత బ్యానర్ వండర్ బార్స్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు `కాలా` అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ఈ టైటిల్‌ను ధనుష్ రివీల్ చేశాడు. కరికాలన్ ట్యాగ్ లైన్. ఈ సినిమాలో దర్శకుడు, నటుడు సుమద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు. ముంబై దారావి సెట్లో చెన్నైలో వేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేష్ హీరోయిన్గా నటిస్తుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments