రజనీకాంత్ 'కాలా'

  • IndiaGlitz, [Thursday,May 25 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. మే 28న సినిమా స్టార్ట్ కానుంది. క‌బాలి త‌ర్వాత పారంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ధ‌నుష్ త‌న స్వంత బ్యాన‌ర్ వండ‌ర్ బార్స్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు 'కాలా' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు.

ఈ టైటిల్‌ను ధ‌నుష్ రివీల్ చేశాడు. క‌రికాల‌న్ ట్యాగ్ లైన్‌. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు, న‌టుడు సుమ‌ద్ర‌ఖ‌ని కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ముంబై దారావి సెట్‌లో చెన్నైలో వేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సంతోష్ నారాయ‌ణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.