బుల్లితెర పై రజనీ కబాలి..!
Friday, October 28, 2016 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సంచలన చిత్రం కబాలి. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించారు. కలై ఫులి ఎస్ థాను ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది. రజనీ గత చిత్రాలకు భిన్నంగా రూపొందిన కబాలి చిత్రం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కబాలి విజయం సాధించడంతో కబాలి 2 ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...వెండితెర పై సంచలనం సృష్టించిన కబాలి చిత్రాన్ని బుల్లితెర పై ప్రసారం చేయనున్నారు. కబాలి శాటిలైట్ రైట్స్ ను పాపులర్ టీవీ మాటీవీ సొంతం చేసుకుంది. నవంబర్ 20న మాటీవీ కబాలి చిత్రాన్ని ప్రసారం చేయనుంది. వెండితెర పై రికార్డ్ క్రియేట్ చేసిన కబాలి బుల్లితెర పై ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.