మామ కబాలి - అల్లుడు తిక్క

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌బాలి అంటూ త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ‌విదేశాల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు. భారతీయ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఓ సంచ‌ల‌న చిత్రంగా నిలిచిన క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. వెండి నాణేల నుంచి సిమ్ కార్డుల వ‌ర‌కు, నేల పై న‌డిచే వాహ‌నాల నుంచి గాలిలో ఎగిరే విమానాల వ‌ర‌కు ఎక్క‌డ చూసిన క‌బాలి. ఇలా క‌నీవినీ ఎరుగ‌ని విధంగా క‌బాలి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. ఈ చిత్రంలో ర‌జ‌నీ రెండు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపంచ‌నున్నారు. యంగ్ & ఓల్డ్ ఈ రెండు గెట‌ప్పులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అభిమానుల‌కు తెర పై ర‌జ‌నీ క‌నిపిస్తే చాలు...అలాంటిది ప్రేక్ష‌కులు కోరుకునే స్టైలు, డైలాగ్స్, యాక్ష‌న్ సీన్స్ ఉంటే...ఫ్యాన్స్ కి ఫెస్టివ‌లే.
ఇదిలా ఉంటే...మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు. డా.సి.రోహిన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.త‌మ‌న్ మ్యూజిక్ అందించిన తిక్క ఆడియోను త్వ‌ర‌లో గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తిక్క‌ చిత్రంలో ఓ పాట‌ను ర‌జ‌నీ అల్లుడు త‌మిళ సూప‌ర్ స్టార్ ధ‌నుష్ పాడారు. ఈ పాట‌ను రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసారు. మామ రజ‌నీకాంత్ క‌బాలి అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న టైమ్ అల్లుడు ధ‌నుష్ తిక్క పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌డం విశేషం.

More News

తిక్క కొత్త టీజ‌ర్ వ‌చ్చేసింది..

సాయిధ‌ర‌మ్ తేజ్, లారిస్సా బొనేసి, మ‌న్నార చోప్రా హీరో,హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. తిక్క కొత్త టీజ‌ర్ ను నిన్న రిలీజ్ చేయాలి కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా వేసి ఈరోజు రిలీజ్ చేసారు.

కబాలి టికెట్స్ కోసం మినిష్టర్ రికమెండేషన్స్..

కబాలి ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతుంది.ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది.

మాయాబ‌జార్ ను ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు..

మాయాబ‌జార్ ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు అన‌గానే ఇదేదో కొత్త సినిమా అనుకుంటే...పొర‌పాటే. అన్న‌పూర్ణ స్డూడియోలో నాగార్జున అన్న‌పూర్ణ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

కాళ‌హ‌స్తిలో క‌బాలి పూజ‌లు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రాల నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కబాలి ఫస్ట్ రివ్యూ...

కబాలి..కబాలి..కబాలి ఎక్కడ విన్న ఇదే మాట. ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది. ఆకాశమే హద్దుగా అంచనాలను ఏర్పరుచుకున్న కబాలి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.