సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'కాలా' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ధనుష్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, వండర్‌బార్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న చిత్రం 'కాలా'. ఏప్రిల్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త లుక్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుంది. 'నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది'
'క్యారే సెట్టింగా.. వీరయ్య బిడ్డన్రా.. ఒక్కడ్నే ఉన్నా.. దిల్లుంటే గుంపుగా రండ్రా..'
'ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని ఎప్పుడూ చూళ్ళేదు కదూ.. ఇప్పుడు చూపిస్తా..' అంటూ రజనీకాంత్ తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్స్ థియేటర్స్‌లో క్లాప్స్ కొట్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రజనీకాంత్, పా.రంజిత్ కాంబినేషన్లో వచ్చిన 'కబాలి' రిలీజ్‌కి ముందు, రిలీజ్ తర్వాత ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 'కాలా' టీజర్ రిలీజ్‌తో మరోసారి వీరిద్దరి సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్లో 'కాలా' మరో సెన్సేషనల్ మూవీగా నిలవబోతోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్, నానా పాటేకర్, సముద్రఖని, ప్రకాశ్‌రాజ్, ఈశ్వరీరావు, హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: మురళి జి., ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వినోద్‌కుమార్, నిర్మాత: ధనుష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పా. రంజిత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments