'కాలా' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `కాలా`. వండర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ముంభై నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా పటేకర్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. రజనీకాంత్‌తో `కబాలి` సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం.
ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయాలనుకున్నారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో జరిగిన బంద్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు తమిళ పరిశ్రమ బంద్ ముగియడంతో అన్నీ సినిమాలు రిలీజ్‌ల పరంగా డేట్స్ ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా నిర్మాత ధనుష్ తన సినిమా `కాలా`ను జూన్ 7న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com