డబ్బింగ్‌లో రజనీకాంత్ 'కాలా'
Send us your feedback to audioarticles@vaarta.com
'కబాలి' తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్, పా.రంజిత్ కలయికలో 'కాలా' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రీకరణ ముగించుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డబ్బింగ్ దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈరోజు (27 డిసెంబర్) ఉదయం చెన్నైలో గల నాక్ స్టూడియోస్ లో డైరెక్టర్ పా.రంజిత్, పలువురు చిత్ర యూనిట్ సమక్షంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం ఈ మూవీ డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టింది చిత్ర బృందం. ముంబై బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంతో సాగే ఈ సినిమాలో రజనీకాంత్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. హ్యూమా ఖురేషి, ఈశ్వరీ రావు, నానాపాటేకర్, సముద్రఖని, సంపత్, రవికాలే, సాయాజీ షిండే, సుకన్య తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
రజనీ అల్లుడు హీరో ధనుష్ ఈ చిత్రానికి నిర్మాత. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15, 2018న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. తెలుగులోనూ అదే రోజున ఈ సినిమా రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments