ర‌జనీకాంత్ చివ‌రి చిత్ర‌మదేనా!

  • IndiaGlitz, [Sunday,September 23 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ 165వ చిత్ర‌మిది. ఈ చిత్రం వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల కానుంది. త్రిష‌, సిమ్రాన్‌, విజ‌య్ సేతుప‌తి, న‌వాజుద్దీన్ సిద్ధికీ తారాగణంగా న‌టిస్తున్నారు.

అయితే ఈ చిత్రం త‌ర్వాత ర‌జ‌నీకాంత్ మ‌రో సినిమా చేస్తార‌ట‌. అది కూడా ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ద‌ర్శ‌కత్వంలో. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ 165 వ చిత్రాన్ని నిర్మిస్తున్న స‌న్ పిక్చ‌ర్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంద‌ని.

పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమానే ర‌జ‌నీకాంత్ న‌టించే చివ‌రి చిత్ర‌మ‌వుతుంద‌ని కోలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అంటే 166 సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ పూర్తిస్థాయి రాజ‌కీయాల్లో బిజీ అయిపోతార‌న్న‌మాట‌.