రజనీకాంత్ అప్పుడే రెడీ అయిపోతున్నాడు...
- IndiaGlitz, [Saturday,February 18 2017]
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ 2.0 శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది. ఈ నెలలో చిత్రీకరణ పూర్తి కాగానే రజనీకాంత్ తన తదుపరి సినిమా కోసం సన్నాహాలు ప్రారంభిస్తాడట. హీరో ధనుష్ వండర్ బార్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ చిత్రానికి కబాలి డైరెక్టర్ పా రంజిత్ దర్శకుడుగా వర్క్ చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను మే నుండే ప్రారంభిస్తారట. సినిమాలో 60 శాతానికి పైగా ముంబైలోనే షూటింగ్ చేస్తారట. రజనీకాంత్ 2.0 ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది.