పిలిచి అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి రజనీకాంత్ - పా.రంజిత్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం `కబాలి`. రజనీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్ గా నటించారు. సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పా రంజిత్ సినిమా విశేషాలను తెలియజేశారు....
ఊహించని స్పందన...
తెలుగులో వస్తున్న రెస్పాన్స్ ఊహించలేదు. ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైనప్పటి నుండి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని అసలు అనుకోలేదు.
ఆయనే పిలిచి అవకాశం ఇచ్చారు...
రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య రజనీకాంత్‌గారు నాకు ఫ్రెండ్. ఆమె ఒకరోజు ఫోన్ చేసి నాన్న నీతో వర్క్ చేయాలనుకుంటున్నారన్నారు.
ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు చేయాలని ఎదురుచూస్తుంటే ఆయన నేను డైరెక్ట్ చేసిన మద్రాస్ సినిమాను చూసిన రజనీకాంత్‌గారు నాకు పిలిచి అవకాశం ఇచ్చారు.అలా ఆయన నాకు అవకాశం ఇవ్వడం గ్రేట్.
కబాలి క్యారెక్టర్ గురించి....
మలేషియా రబ్బరుతోటల్లో పనిచేసే భారతీయల అనేక కష్టాలు పడుతుంటారు. వారి కష్టాలు తీర్చడానికి వారి నుండి కబాలి అనే వ్యక్తి వచ్చి డాన్‌గా మారుతాడు అనేదే కథ. కమలేషియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ. అందుకనే తైవాన్, చైనాలకు సంబంధించిన స్టార్స్‌నే ఈ చిత్రంలో విలన్స్‌గా పెట్టి సినిమా చేశాం.
రెండు లుక్స్ లో కనపడతారు...
ఈ సినిమాలో రజనీకాంత్‌గారు యంగ్, ఓల్డ్ లుక్స్‌లో కనపడతారు. యంగ్ లుక్ కోసం రజనీకాంత్‌గారు నటించిన పాత సినిమాల్లోని ఫోటోస్‌ను రెఫరెన్స్‌గా తీసుకున్నాం. అలాగే ఓల్డ్ గెటప్‌లో ఓ 20 నిమిషాలు మాత్రమే కనపడతారు.
ఆ సినిమా కంటే బాగా నటించారు...
కబాలి అంటే అందరూ యాక్షన్ సినిమా అనుకుంటారు. కానీ యాక్షన్ కంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. గతంలో ఆయన నటించిన ముల్లు మలర్ అనే చిత్రంలో ఆయన నటన ఎక్సలెంట్‌గా ఉంటుంది. దానికంటే ఈ చిత్రంలో ఇంకా బాగా నటించారు.
నెక్ట్స్ మూవీ...
ఈ సినిమా తర్వాత సూర్యగారితో ఓ సినిమా చేయబోతున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com