పిలిచి అవ‌కాశం ఇచ్చిన గొప్ప వ్య‌క్తి ర‌జ‌నీకాంత్ - పా.రంజిత్‌

  • IndiaGlitz, [Monday,June 27 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కబాలి'. రజనీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్ గా నటించారు. సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధం కానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పా రంజిత్ సినిమా విశేషాల‌ను తెలియ‌జేశారు....

ఊహించ‌ని స్పంద‌న‌...

తెలుగులో వ‌స్తున్న రెస్పాన్స్ ఊహించ‌లేదు. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇలాంటి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అస‌లు అనుకోలేదు.

ఆయ‌నే పిలిచి అవ‌కాశం ఇచ్చారు...

ర‌జ‌నీకాంత్‌గారి కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌గారు నాకు ఫ్రెండ్‌. ఆమె ఒక‌రోజు ఫోన్ చేసి నాన్న నీతో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నారన్నారు.
ఎంతోమంది స్టార్ డైరెక్ట‌ర్స్ ఆయ‌న‌తో సినిమాలు చేయాల‌ని ఎదురుచూస్తుంటే ఆయ‌న నేను డైరెక్ట్ చేసిన మ‌ద్రాస్ సినిమాను చూసిన ర‌జ‌నీకాంత్‌గారు నాకు పిలిచి అవకాశం ఇచ్చారు.అలా ఆయ‌న నాకు అవ‌కాశం ఇవ్వ‌డం గ్రేట్‌.

క‌బాలి క్యారెక్ట‌ర్ గురించి....

మ‌లేషియా ర‌బ్బ‌రుతోట‌ల్లో ప‌నిచేసే భార‌తీయ‌ల అనేక క‌ష్టాలు పడుతుంటారు. వారి క‌ష్టాలు తీర్చ‌డానికి వారి నుండి క‌బాలి అనే వ్య‌క్తి వ‌చ్చి డాన్‌గా మారుతాడు అనేదే క‌థ‌. క‌మ‌లేషియా బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే క‌థ‌. అందుక‌నే తైవాన్‌, చైనాల‌కు సంబంధించిన స్టార్స్‌నే ఈ చిత్రంలో విల‌న్స్‌గా పెట్టి సినిమా చేశాం.

రెండు లుక్స్ లో క‌న‌ప‌డ‌తారు...

ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌గారు యంగ్, ఓల్డ్ లుక్స్‌లో క‌న‌ప‌డ‌తారు. యంగ్ లుక్ కోసం ర‌జ‌నీకాంత్‌గారు న‌టించిన పాత సినిమాల్లోని ఫోటోస్‌ను రెఫ‌రెన్స్‌గా తీసుకున్నాం. అలాగే ఓల్డ్ గెట‌ప్‌లో ఓ 20 నిమిషాలు మాత్ర‌మే క‌న‌ప‌డ‌తారు.

ఆ సినిమా కంటే బాగా న‌టించారు...

క‌బాలి అంటే అంద‌రూ యాక్ష‌న్ సినిమా అనుకుంటారు. కానీ యాక్ష‌న్ కంటే ఎమోష‌న్స్ ఎక్కువ‌గా ఉంటాయి. గ‌తంలో ఆయ‌న న‌టించిన ముల్లు మ‌ల‌ర్ అనే చిత్రంలో ఆయ‌న న‌ట‌న ఎక్స‌లెంట్‌గా ఉంటుంది. దానికంటే ఈ చిత్రంలో ఇంకా బాగా న‌టించారు.

నెక్ట్స్ మూవీ...

ఈ సినిమా త‌ర్వాత సూర్య‌గారితో ఓ సినిమా చేయ‌బోతున్నాను'' అన్నారు.

More News

Dil Raju ropes in two Malayalam sensations in a month

Anupama Parameshwaran, who recently made an impact on the audience with her short-lived character in Trivikram Srinivas' A Aa, is now in Dil Raju's good books.  In fact, she has even bagged the role of female lead in one of the producer's next .

Nithin acting in kk radhakrishna production

KK Radha Mohan, the producer of films like Bengal Tiger, has signed up the happening actor Nithiin for his next film.  He has officially said this himself to the world, but the director's name is yet to be disclosed.

'Theri' becomes the biggest in Vijay's 24 years of acting career

There is no doubt that Ilayathalapathy Vijay's latest release 'Theri' is a blockbuster hit all over the world. The film that released on April 14 as a grand Tamil New Year Festival treat has been successfully running in theaters till now.

Mega hero unveils 'Kabali' audio

The much-awaited audio of Kabali was released on the hands of Mega hero Varun Tej in Hyderabad.  The teaser was released by Nani, while T Subbirami Reddy released the banner logo (Shanmukha Films).

Ali Fazal: Broadway Musical missing in our cinema

Ali Fazal is no stranger to the stage! He has worked in several reputed theatre productions in India and recently had his own share of experience with Broadway! Ali was in London on a work trip recently where he had the fortune of having seen one of the most reputed broadway productions, "The Book of Mormons". Post watching the show, Ali contacted a production of one of the broadway shows and mana