మూడు గెటప్స్ లో రజనీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
2010లో సూపర్ స్టార్ రజనీకాంత్ ,శంకర్ల కాంబినేషన్లో విడుదలైన సైంటిఫిక్ థ్రిల్లర్ `రోబో` సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆరేళ్ళ తరువాత రోబో సీక్వెల్‌గా `2.0` చిత్రీకరణ జరుపకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 19న విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
కాగా సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా ఉక్రెయిన్‌లో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ఒకటి కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మూడు గెటప్స్‌లో కనపడటమే. రోబోలో కూడా మూడు గెటప్స్‌లో రజనీకాంత్ కనపడ్డ విషయం తెలిసిందే. మరిప్పుడు సీక్వెల్లో రజనీకాంత్ గెటప్స్ ఎలా ఉంటాయో చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com