జైలులో ర‌జ‌నీకాంత్

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ జైలులో ఉన్నారు. ఇది నిజంగా నిజం. అయితే ఏదో తప్పు చేసి జైలుకి వెళ్ల‌లేదు. షూటింగ్ కోసం జైలుకి వెళ్లారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ డాన్ గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌బాలి షూటింగ్ మ‌లేషియాలో జ‌రుగుతుంది. అక్క‌డ ర‌జ‌నీకాంత్ జైలులో ఉండే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే... శివాజీ సినిమాలో ర‌జ‌నీకాంత్ జైలులో ఉంటాడు.ఆ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. తాజాగా క‌బాలీలో కూడా ర‌జ‌నీకాంత్ జైలులో ఉండే సీన్స్ ఉన్నాయ‌ని తెలిసి... సెంటిమెంట్ ప‌రంగా క‌బాలి స‌క్సెస్ ఖాయం అంటున్నార‌ట ర‌జనీ ఫ్యాన్స్.విభిన్న క‌ధాంశంతో రూపొందుతున్న క‌బాలి చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

జనతా గ్యారేజ్ లో జాహ్నవి..

జనతా గ్యారేజ్..ఎన్టీఆర్ నటిస్తున్న న్యూమూవీ టైటిల్ అని తెలుసు.మరి జాహ్నవి ఎవరనుకుంటున్నారా..?ఇంకెవరు...

అనుష్క గురించి ఆర్య కామెంట్

అందం, అభిన‌యం...ఈ రెండింటికి మ‌రో పేరు అనుష్క‌. అరుంథ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి సౌతిండియా స్టార్ హీరోయిన్ గా బాగా పాపుల‌ర్ అయిన అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం సైజ్ జీరో.

కోనా..ఇది నిజమా..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించి బ్రూస్ లీ చిత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజై...ఆశించిన స్ధాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే.

మొత్తానికి న‌య‌న‌తార సినిమా వ‌స్తోంది

'వ‌ల్ల‌భ' వంటి వివాద‌స్ప‌ద చిత్రం త‌రువాత శింబు, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'ఇదు న‌మ్మ ఆళు'.

'ఎక్స్‌ప్రెస్ రాజా'కి అన్నీ ప్ల‌స్‌లే..

కొన్ని సినిమాలు నిర్మాణ ద‌శ‌లోనే క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో.. శ‌ర్వానంద్ హీరోగా వ‌స్తున్న 'ఎక్స్‌ప్రెస్ రాజా'ని కూడా చేర్చుకోవ‌చ్చు.