తలైవా @ హైదరాబాద్
- IndiaGlitz, [Monday,December 14 2020]
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన 168వ చిత్రం 'అణ్ణాతే' షూటింగ్‌ను పునః ప్రారంభించారు. శివ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. కోవిడ్ ప్రభావం కారణంగా ఆరేడు నెలలుగా ఆగిపోయిన షూటింగ్‌ను పూర్తి చేయడానికి రజినీకాంత్ ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ వేశారు. రజినీకాంత్‌తో పాటు నయనతార కూడా హైదరాబాద్ చేరుకున్నారు. లాంగ్ షెడ్యూల్‌ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా పూర్తి చేయాలనేది యూనిట్ ఆలోచనగా కనిపిస్తుంది. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత రజినీకాంత్ పొలిటిక్స్‌పై దృష్టి సారించనున్నారు.
డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ పేరుని అనౌన్స్ చేసి జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని రజినీకాంత్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈలోపు సెట్స్‌పై ఉన్న అణ్ణాతేను పూర్తి చేయాలని తలైవా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ప్రారంభించిన ఈ షెడ్యూల్లో నయనతార సహా ఖుష్బూ, మీనా, కీర్తిసురేష్, మీనా, ప్రకాష్‌రాజ్ తదితరులు పాల్గొనబోతున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో సమ్మర్లో విడుదల చేసేలా సన్‌పిక్చర్స్ అధినేతలు ప్లాన్ చేస్తున్నారు.