నిన్నటి కంటే మెరుగ్గా రజనీకాంత్ ఆరోగ్యం: అపోలో వైద్యులు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగ్గానే ఉందని వెల్లడించారు. నిన్నటితో చూస్తే ఆయన బీపీ కాస్త తగ్గిందని.. అయితే ఇంకా నార్మల్‌కి రాలేదని వైద్యులు వెల్లడించారు. కాగా.. రజనీ డిశ్చార్జ్‌పై నేటి సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి రజినీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడించారు.
కాగా.. రజనీకాంత్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో వైద్యులు వెల్లడించారు. రజినీని చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దని.. సందర్శకులకు అనుమతి లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాగా.. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. రక్తపోటును అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని, బీపీ సమస్య తప్ప ఇతర ఏ ఇబ్బందులు లేవని స్పష్టం చేశాయి.
ప్రస్తుతం రజినీతో పాటు ఆయన కుమార్తె అశ్వని కూడా ఆసుపత్రిలోనే ఉంది. ఐశ్వర్యకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి రజినీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రముఖ నటుడు కమల్ హాసన్ రజినీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే.. తమిళ సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చిత్రీకరణ నిలిపివేశారు. ఈ నెల 22న రజినీకాంత్ కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments