Vettaiyan:'వేట్టయాన్' షూటింగ్ పూర్తి చేసిన తలైవా రజినీకాంత్

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో 'జై భీమ్' ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రజినీకాంత్ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.

ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

తారాగణం: రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు

More News

CM Revanth Reddy:జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తులు మనవే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎవరికి వారే తమదే ధీమా అని వ్యక్తం చేస్తున్నారు.

Miral:మే 17న ప్రేక్షకులను భయపెట్టనున్న భరత్ 'మిరల్' చిత్రం

'ప్రేమిస్తే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో భరత్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్’తో మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు..

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ ముగిసే నాటికి దాదాపు 75 శాతం పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని మావోయిస్ట్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.

తాగొచ్చి దుర్భాషలాడాడు.. అందుకే ఓటర్‌ను కొట్టాను.. వైసీపీ అభ్యర్థి క్లారిటీ..

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రంలో ఓటరుపై చేయి చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.