రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరు పదులు దాటినా సూపర్ స్టార్ రజనీకాంత్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. యువ కథానాయకులతో పోటీపడుతూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయన. ఇటీవలే కాలా చిత్రంతో అభిమానుల ముందుకొచ్చిన రజనీకాంత్.. తాజాగా తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు.
పిజ్జా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ లోపే మరో సినిమాకి కూడా రజనీకాంత్ ఓకే చెప్పారని తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఆర్.మురుగదాస్ ఇటీవల రజనీకాంత్‌ను సంప్రదించి ఓ కథ చెప్పారట.
మురుగదాస్ చెప్పిన సబ్జెక్ట్ రజనీకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి వెంటనే అంగీకారం తెలిపారట. అన్నీ కుదిరితే.. డిసెంబర్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. అన్నట్టు.. శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన మూడో చిత్రం 2.0 నిర్మాణం పూర్తిచేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com